Loading...

21, నవంబర్ 2010, ఆదివారం

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

విజయనగరం, నవంబర్ 21(చైతన్యవారధి):జిల్లాలో లెవీ సేకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అధికారయంత్రాంగం తమపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటికే తొలివిడతగా జిల్లాలో 63 వేల మెట్రిక్‌ టన్నుల లెవీ సేకరణ లక్ష్యంగా విధించారు. ధాన్యం కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మిల్లర్ల పాయింట్లలో 24 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇదిలాఉండగా ప్రభుత్వ పరంగా భారత ఆహారసంస్థ(ఎఫ్‌సీఐ) ఐదు, పౌరసరఫరాల సంస్థ ఆరు, వ్యవసాయమార్కెట్‌ కమిటీ ఏడు, ఐకేపీ తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేశాయి. ఇందులో భాగంగా కొన్ని కేంద్రాలు తెరుచుకున్నాయి. కొనుగోలు ప్రారంభించాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొద్ది రోజుల్లో కొనుగోలు జరగనుంది. ఇదిలాఉండగా 2010-11 ఖరీఫ్‌ కాలంలో ప్రభుత్వం గ్రేడ్‌-1 ధాన్యానికి రూ.1030, సాధారణ రకానికి రూ.1000 మద్దతు ధర నిర్ణయించినట్లు జిల్లా సంయుక్త కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని కోరారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి