21, నవంబర్ 2010, ఆదివారం
అంగన్వాడీలను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్
విశాఖపట్నం, నవంవర్ 21(చైతన్యవారధి): తొలగించిన అంగన్వాడీ కార్యకర్తలను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిటుకుఅనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తర్వాత కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. యలమంచిలి ఎమ్మెల్యే రాజకీయ వేధింపుల కారణంగా ఎ.కన్యాకుమారి, సరోజనిలను విధుల నుంచి తొలగించారని, ఇవి కక్షపూరితంగా జరిగాయని ఆరోపించారు. తొలగించిన కార్యకర్తలను విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీచేసిందని, ఐ.సి.డి.ఎస్ అధికారులు మాత్రం ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా అలక్ష్యం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ప్రభావతి, రమేష్, వెంకటలక్ష్మి, కుమారి తదితరులు పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి