21, నవంబర్ 2010, ఆదివారం
ముగిసిన జీవీఎంసీ ఉపాధ్యాయ కౌన్సెలింగ్
విశాఖపట్నం, నవంవర్ 21(చైతన్యవారధి): డీఎస్సీ-2008 ద్వారా జీవీఎంసీ పాఠశాలకు ఎంపికైన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ముగిసింది. జీవీఎంసీ పాత సమావేశ మందిరంలో ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ సాయంత్రం నాలుగున్నర వరకు సాగింది. 116 మందికి గాను 115 మంది కౌన్సెలింగ్కు హాజరయ్యారు. వీటిల్లో మూడు ఉర్దూ, రెండు ఒరియా, నాలుగు వికలాంగుల పోస్టులను భర్తీచేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియకు ముందు అధికారులు రోస్టర్ పాయింట్ల జాబితాను, పాఠశాలల ఖాళీల వివరాలను నోటీసు బోర్డులో తెలపలేదు. దీంతో అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఖాళీ జాబితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనికియూనియన్ నాయకులు మద్దతు తెలిపారు. చివరకు అధికారులు ఆ వివరాలను ప్రకటించారు. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగింది. అభ్యర్థులకు ప్రవేశ ఉత్తర్వులు ఇంకా అందాల్సి ఉంది. జీవీఎంసీ కమిషనర్ విష్ణు నగరంలో అందుబాటులో లేనికారణంగా ఉత్తర్వులు ఇంకా ఇవ్వలేదు. సోమవారం వీటిని ఇచ్చే అవకాశం ఉంది. జీవీఎంసీ అదనపు కమిషనర్ (ఫైనాన్స్) పూర్ణచంద్రరావు పర్యవేక్షణలో కౌన్సెలింగ్ ప్రక్రియ జరిగింది. కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారిణి జయకుమారి, ఆర్థిక సలహాదారు వై.మంగపతిరావు, పాఠశాలల పర్యవేక్షకులు విమలకుమారి, ఏపీటీఎఫ్ నగర అధ్యక్షుడు సింగంపల్లి వెంకటరమణ, యూటీఎఫ్ నాయకుడు పైడి కృష్ణారావు, ఎంపీ శ్రీనివాసరావు, జీవీఎంసీ ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి రవి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి