డర్బన్: దక్షిణాఫ్రికా, భారత్‌ల మధ్య డర్బన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో సెంచూరియన్ కధ పునరావృతమైంది. ఈ మ్యాచ్‌లో కూడా భారత టాప్ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ధోనీ సేన ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. 12 ఓవర్లకే ఒపెనర్లు సెహ్వగ్ 25(47), మురళీ
విజయ్19(59)ల వికెట్లు తీసి ఆదిలోనే భారత్‌కు గట్టిషాకిచ్చింది సఫారీ జట్టు. అనంతర బ్యాటింగ్‌కు దిగిన ద్రవిడ్ 25(21), సచిన్ 13(42), లక్ష్మణ్ 38(94), పుజరా 19(54)లు ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. కెప్టెన్ ధోని 20(31), హర్భజన్‌సింగ్ 15(25)తో కలసి జట్టును ముందుకు నడుపుతున్నాడు. భారత టాప్ఆర్డర్ కూల్చడంలో సఫారీ బౌలర్ల వ్యూహం ఫలిచింది. అద్భుతంగా బౌలింగ్ చేసి స్టెయిన్‌కు నాలుగు వికెట్లు తీయగా, తొత్సంబేకు రెండు వికెట్లు దక్కాయి.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి