Loading...

13, డిసెంబర్ 2010, సోమవారం

2012లో నిప్పులు చెరగనున్న సూర్యుడు

లండన్‌: సౌరక్రియాశీలత గత యాభై ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రంగా 2012లో ఉంటుందని.. దీనివల్ల మొబైల్‌ఫోన్లు, గ్లోబల్‌ పొజిషనింగ్‌ వ్యవస్థ, జాతీయగ్రిడ్లకు అంతరాయం కలగవచ్చని ఖగోళశాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సూర్యుని మధ్యరేఖపైనున్న అయస్కాంతక్షేత్రం ధ్రువాల మీద ఉన్నప్పటికన్నా అధికవేగంతో భ్రమణం చేయటం వల్లే సౌరక్రియాశీలత అధికంగా ఉండనుందని వివరించారు. ఈ నేపథ్యంలో..
ఉత్తరాదిదేశాల్లో రాత్రి సమయాన గగనతలాన కనిపించే కాంతిపుంజాలు (నార్తెర్న్‌లైట్స్‌) కూడా 2012లో అత్యంత ప్రకాశవంతంగా ఉంటాయని తెలిపారు. దక్షిణాన ఉన్న రోమ్‌ వరకూ కనిపిస్తాయన్నారు. బ్రిటన్‌ పత్రిక డెయిలీమెయిల్‌ ఈ వివరాలను ఆదివారం వెల్లడించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి