Loading...

7, డిసెంబర్ 2010, మంగళవారం

టన్ను చెరకుకు రూ. 2,500లు చెల్లించాలి

-చోడవరం ఎమ్మెల్యే రాజు
చోడవరం: చెరకు టన్ను ధర రూ. 2,500లు చెల్లించాలన్నది ప్రధాన డిమాండు అని చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు పేర్కొన్నారు. సోమవారం దీక్షా శిబిరం వద్ద ఆయన మాట్లాడారు. ముందుగా అనుకున్నట్లు దీక్షలు ఈ నెల 9 వరకు జరుగుతాయన్నారు. అనంతరం అదే రోజు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. చెరకు రైతులకు తీపిని పంచేవరకు ఉద్యమం ఆగదని ఆయన అన్నారు.
సోమవారం నాటి నిరవధిక నిరాహరదీక్షల్లో రావికమతం మండల తెదేపా నాయకులు కూర్చొన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు ఆర్లె నూకరాజు, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ వెల్లంకి మోదినాయుడు, మండల పార్టీ కార్యదర్శి కోట గోవిందరావు, బంటు నారాయణమూర్తి, వజ్రపు సాంబయ్య, ఉగ్గిన నర్సింహనాయుడు, గెంజి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి