హైదరాబాద్: ఎంసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షల తేదీలు ఈ నెలాఖరుకు ఖరారు కానున్నాయి. ఈ నెల 30న జరిగే సమావేశంలో ‘సెట్’ల తేదీలు, పరీక్షలు నిర్వహించే యూనివర్సిటీలను, కన్వీనర్లను ప్రకటించనున్నట్లు గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ పి.జయప్రకాశ్‌రావు తెలిపారు. కాగా ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ ప్రవేశ పరీక్షను మేలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, గత ఏడాది వివిధ పరీక్షలు నిర్వహించిన వర్సిటీలకే ఆయా ప్రవేశ పరీక్షల బాధ్యతలు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. ఎంసెట్, ఈసెట్‌లను జేఎన్టీయూ(హెచ్), ఐసెట్ని ఆంధ్ర వర్సిటీ, ఎడ్సెట్ని ఉస్మానియా యూనివర్సిటీ, లాసెట్‌ని శ్రీవేంకటేశ్వర వర్సిటీకి అప్పగించనున్నట్లు తెలిపారు. వీలైతే 29నే పరీక్ష తేదీలను ప్రకటిస్తామని చెప్పారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి