పులివెందుల: తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పార్టీ ఏర్పడబోతోందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 45 రోజుల్లో పార్టీ, జెండా వస్తుందని జగన్ వెల్లడించారు. ఈ ఉదయం పులివెందుల నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన జగన్ వారినుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనకు రెండు దారులు చూపించిందని... చెప్పిన మాట వింటే రాజకీయాల్లో ఉన్నత స్థానానికి తీసుకెళ్తామన్నారని... మరోదారిలో వెళ్తే రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్నారని జగన్ అన్నారు. ఎమ్మెల్యేలను ఢిల్లీ పిలిపించుకొని తన యాత్రలో పాల్గొనవద్దని కాంగ్రెస్ అధిష్ఠానం సూచించిందన్నారు.
తనకు మద్దతిచ్చినవారిని, తోడుగా నిలిచినవారిని పార్టీనుంచి బయటకు పంపారని విమర్శించారు. తన ఇల్లు, కార్యాలయాలకు పోలీసులు వచ్చారన్నారు. పార్టీ నుంచి తనను బయటకు పంపడానికి కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేసిందని తెలిపారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి