చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు తమిళనాట కోలాహలంగా సాగాయి. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న రజనీకాంత్ ఆదివారం 61వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ఆలయాల్లో రజనీకాంత్ పేరిట ప్రత్యేక పూజలు, యాగాలు, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పేదలకు ఉచిత వస్త్రాల పంపిణీ, అన్నదానం,
విద్యార్థులకు నోటుపుస్తకాలను అందజేశారు. రజనీకాంత్ చెన్నైలోని ఆయన నివాసంలో లేకపోయినా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది అభిమానులు ఇంటివద్ద క్యూకట్టడం విశేషం. అనంతరం ఆయన కటౌట్లకు దిష్టి తీయడం, పాలాభిషేకాలు వంటివి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది 'రోబో' అభిమానులు రక్తదానం చేశారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి