Loading...

3, డిసెంబర్ 2010, శుక్రవారం

ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇంటిపై ఏసీబీ దాడులు

హైదరాబాద్‌: ట్రాన్స్‌కో సెంట్రల్‌ సర్కిల్‌ ఎస్‌.ఈ. ప్రభాకర్‌ ఇంటిపై ఏసీబీ ఈ ఉదయం దాడులు నిర్వహించింది. మాదన్నపేటలోని ఆయన నివాసంలో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ ఈ దాడులు చేసింది. ఈ సోదాల్లో అధికారులు సుమారు రూ. 10 కోట్లకు పైగా ఆస్తులకు సంబంధించిన పత్రాలను గుర్తించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి