అచ్యుతాపురం, డిసెంబరు 9 (చైతన్యవారధి): కాంగ్రెస్లో కొంత మంది వ్యక్తులు జగన్ను అన్యాయంగా పార్టీ నుంచి పంపించారని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం అచ్యుతాపురంలో జగన్ అభిమానులు, కార్యకర్తలను కలిసిన సందర్భంగా స్థానిక విలేకర్లతో మాట్లాడారు. జగన్లేని కాంగ్రెస్ పార్టీని వూహించలేమని తేల్చి చెప్పారు. జగన్ కాంగ్రెస్లో లేకుంటే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవటం కష్టమని జోస్యం చెప్పారు. జగన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయం తీసుకుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో 2 పర్యాయాలు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన వై.ఎస్.ఆర్ కుటుంబానికి సరైన గౌరవం దక్కలేదని ఆరోపించారు. వచ్చే నెల 2 నుంచి జిల్లాలో ఓదార్పు యాత్ర ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఓదార్పు యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్లో ఉండాలా, జగన్ పార్టీలో చేరాలనే విషయంపై నియోజకవర్గాల వారీగా కార్యకర్తలంతా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. 90 శాతం ప్రజలు గ్రామాల్లో జగన్పై అభిమానం ప్రకటిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా కొణతాలకు స్థానిక నేతలు, జగన్ అభిమానులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. జగన్కు మద్దతుగా నిలవాలని ఆయన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పల్లిశేషగిరిరావు, దుప్పుతూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రగడ చిననాగేశ్వరరావు, అచ్యుతాపురం మాజీ సర్పంచి రెడ్డిఅప్పలనాయుడు, పంచదార్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి