హైదరాబాద్: రైతుల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడం, ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేతలు మంగళవారమిక్కడ సమావేశమయ్యారు. రైతాంగం ఇప్పటికే ఉద్యమంలో పాల్గొంటుందని, వారందరితో కలిసి బుధవారం అన్ని జిల్లా కలెక్టరేట్లను దిగ్భంధించాలని నిర్ణయించారు.
ఈ దిగ్భంధనం కార్యక్రమంలో పాల్గొనేందుకు సీనియర్ నేతలను వివిధ జిల్లాలకు పరిశీలకులుగా నియమించారు. ఆదిలాబాద్‌కు ఎల్.రమణ, నిజామాబాద్‌కు వేణుగోపాలాచారి, కరీంనగర్ అరికెల నర్సారెడ్డి, మెదక్ మండవ వెంకటేశ్వర్రావు, రంగారెడ్డి వర్ల రామయ్య, ప్రకాశం కోడెల శివప్రసాదరావు, నెల్లూరు ముద్దుకృష్ణమనాయుడు, కడప బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, అనంతపురం బాబూ రాజేంద్రప్రసాద్, గుంటూరు కరణం బలరామకృష్ణమూర్తి, కాగిత వెంకట్రావు, మెదక్ మండవ వెంకటేశ్వరరావు, విశాఖపట్నం కళా వెంకట్రావు, విజయనగరం చిక్కాల రామచంద్రరావు... ఇలా ఒక్కో జిల్లాకు ఒక్కొక్కరిని పరిశీలకులుగా పంపించారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి