Loading...

12, డిసెంబర్ 2010, ఆదివారం

పంటపొలాలను పరిశీలించిన డీఎస్‌

విజయనగరం: విశాఖ, విజయనగరం జిల్లాలో భారీవర్షాల వల్ల దెబ్బతిన్న పంటపొలాలను పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ పరిశీలించారు. విశాఖజిల్లాలోని ఆనందపురం, విజయనగరం జిల్లాపూసపాటిరేగ మండలం నాతవలసలో పంటపొలాలను పరిశీలించి రైతులను పరామర్శించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులందర్నీ ప్రభుత్వం ఆదుకుంటుందని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ విజయనగరం పర్యటనలో అన్నారు.
బాధిత రైతులకు పంట పరిహారంతో పాటు ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా సౌకర్యం అందించేలా ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. అన్నదాతలను ఆదుకునేందుకు రాష్ట్రానికి అదనపు సాయం కోసం కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. జిల్లాలో దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు. భోగాపురం మండలం రావాడ, పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామాల రైతులను పరామర్శించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి