Loading...

18, డిసెంబర్ 2010, శనివారం

బాబు దీక్షా శిబిరానికి భద్రత పెంపు

హైదరాబాద్‌: చంద్రబాబు దీక్షా శిబిరానికి కార్యకర్తల తాకిడి ఎక్కువవుతుండడంతో పోలీసులు భద్రత పెంచాలని నిర్ణయించారు. కొద్దిసేపటి క్రితం దీక్షా శిబిరానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు పార్టీ సీనియర్‌ నేతలతో భద్రతాపరమైన అంశాలపై చర్చించారు. ఒక ఏసీపీ, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఆరుగురు ఎస్సైలు, ఏడు ప్లాటూన్ల పోలీసు బలగాలతో భద్రత పెంచారు. బారికేడ్ల ద్వారా వెళ్లడానికి, తిరిగి రావడానికి వేర్వేరుగా ద్వారాలు ఏర్పాటు చేయాలని నేతలకు సూచించారు. ఎప్పటికప్పుడు భద్రతను సమీక్షించేందుకు ...
ప్రత్యేకంగా కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు నేతలతో చెప్పారు.
కొనసాగుతున్న చంద్రబాబు నిరశన : రైతు సమస్యలపై తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. నేడు చంద్రబాబుతోపాటు 16 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు దీక్షలో పాల్గొననున్నారు. చంద్రబాబు దీక్షకు మద్దతుగా నేటి నుంచి మూడు రోజులపాటు తెదేపా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. దెబ్బతిన్న పంటలను అన్ని మండల కేంద్రాల్లోని రహదారులపై తెదేపా శ్రేణులు ప్రదర్శించనున్నాయి. చంద్రబాబు దీక్షకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో నేడు తమ్మినేని సీతారాం నిరాహారదీక్ష చేపట్టనున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి