హైదరాబాద్: హోటళ్లలో నూతన సంవత్సర వేడుకలపై నిఘాకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ తెలిపారు. దీనికోసం 12మంది ఏసీపీలతో ప్రత్యేకబృందాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో సంగీత ధ్వని 45 డెసిబెల్స్కు మించి ఉండకూడదని, నృత్యాలు సభ్యతకు లోబడే ఉండాలని తెలిపారు. హోటల్ యజమానులు రాత్రి ఒంటిగంటలోగా నూతన సంవత్సర వేడుకలను పూర్తిచేయాలని కోరారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి