విశాఖ: విశాఖ మన్యంలోని చింతపల్లి మండలం చెరువూరు ఎన్కౌంటర్కు నిరసనగా నేడు ఆంధ్ర-ఒడిషా సరిహద్దులో మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. గత శుక్రవారం చెరువూరులో ఎన్కౌంటర్ జరిగి నలుగురు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మావోయిస్టుల బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు మంగళవారం సాయంత్రం నుంచే మారుమూల ప్రాంతాలకు వెళ్లే బస్సులను నిలిపివేశారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి