న్యూఢిల్లీ: కడప ఎంపీ పదవికి జగన్ చేసిన రాజీనామాను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఈరోజు ఆమోదించారు. జగన్ తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా సోమవారం స్పీకర్‌కు పంపిన సంగతి తెలిసిందే. ఆమె ఈరోజు దానిని ఆమోదించారు. రోశయ్య రాజీనామా, కిరణ్‌కుమార్‌రెడ్డికి సీఎం పదవి ఇవ్వడం తదనంతర పరిణామాల నేపథ్యంలో తన కుటుంబానికి అన్యాయం జరిగిందని పేర్కొంటూ జగన్ పార్టీ అధినేత్రికి లేఖ రాశారు. దాంతోపాటే తన రాజీనామా పత్రాన్ని కూడా పంపారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి