హైదరాబాద్ : గత ఏడు రోజులుగా రైతు సమస్యలపై చంద్రబాబు చేస్తున్న నిరాహార దీక్షను నిమ్స్ వైద్యులు భగ్నం చేశారు. ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించినట్లు నిమ్స్ డైరెక్టర్ పీవీ రమేష్ వెల్లడించారు. బాబు ఆరోగ్యం విషమించడంతోనే తమ వంతు బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
చికిత్సకు నిరాకరిస్తున్న బాబును పోలీసుల సహాయంతో ఐసీయూలోకి తరలించి ఫ్లూయిడ్స్ ఇచ్చినట్లు వివరించారు. తాజ చర్యల వల్ల మరో 24 గంటల వరకు చంద్రబాబు ఆరోగ్యం స్టేబుల్‌గా ఉండే అవకాశముందని డాక్టర్ సోమరాజు చెప్పారు. ఫ్లూయిడ్స్ ఎక్కించడం వల్ల హార్ట్‌బీట్, బీపీ, సుగర్ నార్మల్ స్టేజికి వస్తాయని వైద్యులు తెలిపారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి