వరంగల్: ప్రమాదవశాత్తు ఓ బాలుడి తలకు గుచ్చుకున్న స్క్రూ డ్రైవర్‌ను హన్మకొండలోని రోహిణి ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. వరంగల్ నగరంలోని సుబేదారికి చెందిన సద్దాం హుస్సేన్ (13) శనివారం ఉదయం తన సైకిల్‌కు పంచర్ వేస్తుండగా...పక్కనే బాలుడి సోదరుడు స్క్రూ డ్రైవర్నుపైకి ఎగరేశాడు. ప్రమాదవశాత్తు అది సద్దాం తలలోకి సుమారు మూడంగుళాల మేర లోపలికి...
వెళ్లడంతో వెంటనే ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. పుర్రె లోపలి వరకు వెళ్లిన స్క్రూడ్రైవర్‌ను తీసేందుకు సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ టి.సంజయ్ నేతృత్వంలో పలువురు వైద్యులు రెండు గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించారు. ఇలాంటి వాటిని పినిట్రేటింగ్ హెడ్ ఇంజ్యూరీస్ అంటారని చెప్పారు. సద్దాంకు ఆపరేషన్ విజయవంతమైందని ప్రాణాపాయం లేదని డాక్టర్ సంజయ్ తెలిపారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి