Loading...

12, డిసెంబర్ 2010, ఆదివారం

విశాఖలో గాలిపటాల పండుగ

విశాఖపట్నం, డిసెంబర్ 12 (చైతన్యవారధి): ఆకాశహర్మ్యాలతో పోటీపడుతూ విశాఖలో చిన్నారులు గాలిపటాల పండుగ జరుపుకొన్నారు. నగరంలోని బీచ్‌ రోడ్డులో రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బీచ్‌కు వచ్చిన సందర్శకులు సహా వారి పిల్లలు సైతం ఇందులో పాల్గొని గాలిపటాలు ఎగరేస్తూ ఆనందంగా గడిపారు. పిల్లల్లో మానసిక ఉత్సాహాన్ని నింపడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి