విశాఖపట్నం: విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయంలో నానో సాంకేతిక పరిజ్ఞానంపై శుక్రవారం నుంచి మూడు రోజులపాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి ప్రొఫెసర్ జి.సుబ్రమణ్యం తెలిపారు. భారత్‌తోపాటు మరో 10 దేశాలకు చెందిన 150 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు హాజరుకానున్నట్లు వెల్లడించారు. భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతికి అర్హుడిని నిర్ణయించే కమిటీలోని సభ్యుడు స్వీడన్...
హెరియట్‌వాట్ విశ్వవిద్యాలయం పరిశోధకులు మెట్జాన్సన్ కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. నోబెల్ బహుమతుల ఎంపిక విధానంపై ఆయన ప్రసంగిస్తారని తెలిపారు. వివిధ రంగాల్లో నానో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై జరుగుతున్న అధ్యయనాలను, ప్రగతిని విస్తృతంగా చర్చిస్తారని పేర్కొన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి