-భారత క్రికెట్ జట్టు మాజీ మేనేజర్ డీవీ సుబ్బారావు
విశాఖపట్నం,డిసెంబర్ 29 (న్యూస్‌నెట్): క్రికెట్లో దేశం గర్వించదగ్గ క్రీడాకారుడిగా ప్రపంచ రికార్డులు నెలకొల్పిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు భారత రత్న అవార్డు ఇవ్వాలని భారత క్రికెట్ జట్టు మాజీ మేనేజర్, జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షులు డీవీ సుబ్బారావు అన్నారు.
నగర క్రీడాకారులు, స్వచ్చంధ సంస్థ ప్రతినిధుల ఆధ్వర్యంలో బుధవారం ఆయన కార్యాలయంలో సచిన్‌కు భారత రత్న ఇవ్వాలనే పోస్టరును ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత 25 ఏళ్లలో సచిన్ చూపిన ప్రతిభ దేశానికే గర్వకారణమన్నారు. వాస్తవానికి భారత రత్న వంటి పురష్కారాలు ఏడు పదుల దాటిన వ్యక్తులకు ఇవ్వడం అన్ని విధాలా శ్రేయస్కారం అనే విషయం గుర్తించాల్సి ఉన్నా, క్రికెట్లో పదవీవిరమణ వయస్సు నాలుగు పదుల లోపేనని సచిన్ విషయంలో దీన్ని సడిలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి కె.పార్థసారధి, పోస్టరు రూపకర్త,పీఈటీ సనపల పాండురంగారావు, స్వచ్చంధ సంస్థ ప్రతినిధులుఎన్.రామక్రిష్ణ, న్యాయవాది శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం,డిసెంబర్ 29 (న్యూస్‌నెట్): క్రికెట్లో దేశం గర్వించదగ్గ క్రీడాకారుడిగా ప్రపంచ రికార్డులు నెలకొల్పిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు భారత రత్న అవార్డు ఇవ్వాలని భారత క్రికెట్ జట్టు మాజీ మేనేజర్, జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షులు డీవీ సుబ్బారావు అన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి