Loading...

29, డిసెంబర్ 2010, బుధవారం

ఊహాజనిత వార్తలను ప్రసారం చేయవద్దు : అంబికా సోని

న్యూఢిల్లీ : జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నేడో రేపో నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో కేంద్ర సమాచార శాఖ మంత్రి అంబికాసోని హోంమంత్రి చిదంబరంతో సమావేశం అయ్యారు. ఈ భేటీ అనంతరం అంబికాసోని మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మీడియా సంయమనంతో వ్యవహరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ మీడియాకు
కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఊహాగానాలు, కథనాలు ప్రసారం చేయవద్దని మీడియాపై ఆమె ఆంక్షలు విధించారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక వివరాలను మీడియాకు తెలియచేసేందుకు నోడల్ అధికారిని నియమించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమన్వయంతో నోడల్ అధికారి సమాచారాన్ని వెల్లడిస్తారు. నోడల్ అధికారి అధికారికంగా ధ్రువీకరించిన తర్వాతే ఏవార్త అయినా ప్రసారం చేయాలని సూచించారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి