ఢిల్లీ: చాలా మంది పార్టీలోంచి వెళ్లిపోయారని, అలాంటి వారితో కాంగ్రెస్కు ఎలాంటి నష్టం లేదని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ కొత్తపార్టీ అంశాన్ని ఢిల్లీలో విలేకరులు ఆయన దృష్టికి తెచ్చినప్పుడు పైవిధంగా స్పందించారు. ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ పదవులను సరైన సమయంలో ప్రకటిస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీఎం తన ఢిల్లీ పర్యటనలో భాగంగా శ్రీకృష్ణ కమిటీ సభ్యుడు దుగ్గల్ను కలిశారు.
ఆయనను మర్యాద పూర్వకంగానే కలిశానని తెలిపారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి