కేరళ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ కాంగ్రెస్ నేత కె.కరుణాకరన్ మృతి చెందారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. జ్వరం, శ్వాస అందకపోవటంతో బాధపడుతున్న ఆయనను డిసెంబర్ 10న త్రివేండ్రంలోని వైద్య కళాశాల ఆసుపత్రి ఐసీయులో చేర్చారు. ఆయన అప్పటినుంచి వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఇటీవలే వెంటిలేటర్‌ను తొలగించారు.
బుధవారం మళ్లీ ఇబ్బంది తలెత్తటంతో వెంటిలేటర్‌పై ఉంచారు. పరిస్థితి విషమించి ఈరోజు కన్నుమూశారు. 1918 జులై 18న కేరళలోని కన్నూరులో జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు. భార్య మృతి చెందారు. 19 ఏళ్లకు కాంగ్రెస్‌లో చేరారు. 1970లో ఎల్డీఎఫ్ను ఏర్పాటుచేసిన ఆయన 1977లో మొదటిసారి కేరళ సీఎంగా పనిచేశారు. కేంద్రంలో పరిశ్రమల మంత్రిగా కూడా పనిచేశారు. మొత్తం 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్‌లకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఆ తరువాత వారితో విభేదాలు వచ్చి పార్టీకి రాజీనామా చేశారు. సొంత పార్టీని స్థాపించి అనంతరం దాన్ని ఎన్సీపీలో విలీనం చేశారు. ఆ తరువాత ఆయన ఆయన కుమార్తె పద్మజ కాంగ్రెస్‌లోనే చేరారు. కుమారుడు మరళీధరన్ మాత్రం ఎన్సీపీలోనే ఉన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి