విశాఖపట్నం, చైతన్యవారధి: తెలుగుదేశానికి పూర్వ వైభవం తేవడానికి కార్యకర్తలంతా సమష్ఠి కృషి చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షులు అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం జిల్లా కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు. ప్రజలకు అన్యాయం జరిగితే పార్టీ అంతా వారి పక్షాన ఉండాలన్నారు. అఖిలపక్షాలతో కలిసి 11వ తేదీ ఉదయం
10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రహదారులు దిగ్బంధం చేయాలని నిర్ణయించామన్నారు. దీనిని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు గవిరెడ్డి రామానాయుడు, సివేరి సోమ, వెలగపూడి రామకృష్ణబాబు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు చెంగల వెంకటరావు, కె.ఎస్.ఎస్.రాజు, కోన తాతారావు, భాస్కర్రావు, నాగేశ్వరరావు, తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా కార్యాలయ సమన్వయ కార్యదర్శి పి.ఎస్.నాయుడు, నేతలు పప్పు రాజారావు, రంగబాబు, బైరెడ్డి పోతనరెడ్డి, గండి దేముడుబాబు, కాళ్ల శంకర్రావు, తదితరులు పాల్గొన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి