Loading...

20, డిసెంబర్ 2010, సోమవారం

నిమ్స్‌ వద్ద బైఠాయించిన రైతులు

హైదరాబాద్‌: నిమ్స్‌లో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును కలిసి ఆయనకు మద్దతు తెలిపేందుకు ఈరోజు నిజామాబాద్‌నుంచి పెద్దసంఖ్యలో రైతులు తరలివచ్చారు. వీరంతా నిమ్స్‌ వద్దకు రాగా వారిని లోపలకు వెళ్లనివ్వలేదు. పోలీసులతో వాగ్వాదం అనంతరం వారు నిమ్స్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. దీంతో ప్రతి నిముషం రద్దీగా ఉండే ఈ రోడ్డులో భారీగా ట్రాఫిక్‌ స్థంభించింది. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి