హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోగ్యం విషమించిందని, ఇకపై దీక్ష కొనసాగించటం ఆయన ఆరోగ్యరీత్యా మంచిదికాదని నిమ్స్ డైరక్టర్ రమేష్ అన్నారు. బాబు శరీరంలో ఎలక్ట్రోలైట్స్ తగ్గాయని చెప్పారు. ఆహారం తీసుకోవాలని చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులకు గట్టిగా చెప్పామన్నారు.
ఆహారం తీసుకునేందుకు బాబు పూర్తిగా నిరాకరిస్తున్నారని అన్నారు. బాబుకు ప్రతి 6 గంటలకు ఓసారి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి