-శాసనమండలి చైర్మన్ శ్రీచక్రపాణి
విశాఖపట్నం, డిశంబరు 27: నూరేళ్ల క్రితం ప్రజా స్వామ్యం అవతరించబోతోందని ఊహించి రవీంద్రనాద్ ఠాగుర్ వ్రాసిన జనగణమన జాతీయగీతం అధ్బుతమైన ప్రభంజనమని, భారతజాతి ఔన్నత్యానికి నిదర్శనమని శాసనమండలి చైర్మన్ చక్రపాణి అన్నారు. సోమవారం ఉదయం ఆంధ్రాయూనివర్సిటీ లైబ్రరి
ప్రాంగణంలో జనగణమన జాతిపండగ శత వత్సర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. 1911 సంవత్సరం డిశంబరు 27 ఇదే రోజున రవీంద్రుడు ఆలపించిన ఈ గీతం ద్వారా జాతి సమైఖ్యత ప్రాముఖ్యతను ప్రభోదించారని ఆయన అన్నారు. ఈ జాతీయ గీతం ఆలపించడం ద్వారా ప్రతి భారతీయునిలో జాతీయ భావం మరింత పెంపొందింప బడుతుందని అన్నారు. ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ వంద సంవత్సరముల ఉత్సవాల వార్షిక క్యాలెండర్ను, జనగణమన సంగీత దృశ్యమాలిక సి.డి.ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి శ్రీ ఎల్.ఆర్.స్వామి అద్యక్షత వహించగా ఆంధ్రా యూనివర్సీటీ ఉపకుపతి డా.బి.సత్యనారాయణ, కృష్ణాజిల్లా జిల్లా పరిషత్ అధ్యక్షులు డా.కె.ఎన్.రావు, ఆంధ్రా యూనివర్సిటీ లైబ్రేరియన్ శ్రీసోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు శ్రీ చక్రపాణి ఆంధ్రా యూనివర్సిటీ లైబ్రరీలోని రవీంద్రనాద్ ఠాగూర్ విగ్రహానికి పూలమాల వేసారు. లైబ్రరీలోని ప్రతి విభాగానికి వెళ్లి అక్కడ ఉంచిన గ్రంధాలను పరిశీలించారు.
విశాఖపట్నం, డిశంబరు 27: నూరేళ్ల క్రితం ప్రజా స్వామ్యం అవతరించబోతోందని ఊహించి రవీంద్రనాద్ ఠాగుర్ వ్రాసిన జనగణమన జాతీయగీతం అధ్బుతమైన ప్రభంజనమని, భారతజాతి ఔన్నత్యానికి నిదర్శనమని శాసనమండలి చైర్మన్ చక్రపాణి అన్నారు. సోమవారం ఉదయం ఆంధ్రాయూనివర్సిటీ లైబ్రరి
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి