Loading...

25, డిసెంబర్ 2010, శనివారం

రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం - సీఎం

తిరుపతి: రైతులకు ప్రభుత్వం ఏమీ చేయట్లేదన్న ప్రచారం వాస్తవం కాదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రైతు సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని... వీలైనంత మేర ఎక్కువ సాయం చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. ప్రస్తుతం రైతులకిచ్చే ప్యాకేజీ సరిపోతుందని తామూ భావించడం లేదన్నారు.
ఇన్‌పుట్‌ సబ్సిడీ పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. ఆత్మహత్యలకు పాల్పడకుండా రైతులు ఆత్మస్త్థెర్యంతో ఉండాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళతామని పునరుద్ఘాటించారు. తిరుపతి పర్యటన ముగించుకొని సీఎం కలికిరికి వెళ్లారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి