ఢిల్లీ: చిన్న రాష్ట్రాల అంశంపై ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన అత్యవసర సమావేశం ముగిసింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించనున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాల డిమాండ్ దృష్ట్యా రెండో ఎస్సార్సీ వేయడంపై కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు మరో కమిటీ వేసే అవకాశం కనిపిస్తోంది. గురువారం ఉదయం శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రణబ్, ఏకే ఆంటోనీ, చిదంబరం, మొయిలీ పాల్గొన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి