Loading...

13, డిసెంబర్ 2010, సోమవారం

నక్సల్స్‌పై నిఘాకు బెలూన్‌ విమానాలు...

న్యూఢిల్లీ: నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో నిఘాకోసం భారతీయ శాస్త్రజ్ఞులు స్వదేశీ పరిజ్ఞానంతో ఓ బెలూన్‌ విమానా(ఏరోస్టాట్‌)న్ని తయారుచేశారు. 'ఛక్షు' పేరుగల ఈ బెలూన్‌ విమానాన్ని నేషనల్‌ ఏరోస్పేస్‌ లాబొరేటరీస్‌ (నాల్‌), శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌), డీఆర్‌డీవోలు సంయుక్తంగా రూపొందించాయి.
బెలూన్‌ విమానంలో 320 ఘనపు మీటర్ల హీలియం వాయువును నింపుతారు. ఇందులోని 3కెమెరాలు 30కి.మీ. వ్యాసార్థంపరిధిలో ఫొటోలు తీస్తాయి. ఇది నిరంతరంగా 6గంటలపాటు గాల్లో ప్రయాణించగలదు. ఛక్షును రిమోట్‌తో పనిచేయించవచ్చు. ''ఛక్షును పరీక్షించడానికి ప్రస్తుతం ఫ్లయిట్‌ రేంజ్‌ అందుబాటులో లేదు. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఫ్లయిట్‌రేంజ్‌ నిర్మాణం పూర్తయిన అనంతరం వచ్చే ఏడాది పరీక్షిస్తాం''అని నాల్‌ శాస్త్రజ్ఞులు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి