హైదరాబాద్: తెదేపా అధినేత చంద్రబాబు ఈరోజు నిమ్స్ నుంచి ఇంటికి వెళ్లనున్నారు. రైతు సమస్యలపై నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన చంద్రబాబు గత రాత్రి దీక్ష విరమించిన విషయం తెలిసిందే. ఈ ఉదయం 11 గంటల సమయంలో చంద్రబాబు నిమ్స్ నుంచి డిశ్చార్జి కానున్నారు. ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ...
తెదేపా సీనియర్ నేతలు భేటీ కానున్నారు. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై నేతలు చర్చించనున్నారు. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ను తెదేపా నేతలు కలవనున్నారు. రైతు సమస్యలపై రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించనున్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి