Loading...

21, డిసెంబర్ 2010, మంగళవారం

చంద్రబాబును పరామర్శించిన పలువురు నేతలు

హైదరాబాద్‌: రైతు సమస్యలపై నిరాహారదీక్ష చేస్తున్న చంద్రబాబును పరామర్శించేందుకు పలువురు నేతలు నిమ్స్‌ ఆస్పత్రికి తరలివస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యం బాగా నీరసించడంతోపాటు ఆయనకు జలుబు రావడం వల్ల వైద్యులు ఎవరినీ ఆయన వద్దకు వెళ్లొద్దని సూచించారు. ఈ మేరకు నాయకులంతా
చంద్రబాబును దూరం నుంచే చూసొస్తున్నారు. చంద్రబాబును పరామర్శించిన వారిలో పార్టీ నాయకులు మురళీమోహన్‌, నన్నపనేని రాజకుమారి, చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, బీవీ రాఘవులు ఉన్నారు. నిమ్స్‌ గేటు వద్ద తెదేపా కార్యకర్తలు ఆందోళన చేయడంతో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి