Loading...

29, డిసెంబర్ 2010, బుధవారం

శ్రీకృష్ణ కమిటీ నివేదిక అంశాల వెల్లడికి నోడల్‌ అధికారి

న్యూఢిల్లీ: శ్రీకృష్ణకమిటీ తన నివేదిక సమర్పించిన తరువాత అందులోని అంశాల వెల్లడికి ఓ నోడల్‌ అధికారిని నియమించనున్నారు. కేంద్ర సమాచారశాఖ మంత్రి అంబికాసోని  కేంద్ర హోంమంత్రి చిదంబరంతో భేటీ అయి ఈ విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన అంగీకరించారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ సమన్వయంతో ఈ అధికారి
పనిచేస్తారు. అంబికాసోనీ మీడియాతో ఈ విషయాలు తెలిపారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఊహాజనిత కథనాలు వద్దని ఆమె మీడియాకు విజ్ఞప్తి చేశారు. మీడియా ఎన్‌బీఏ మార్గదర్శకాలు పాటించాలని కోరారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి