-సైబర్ భద్రతా నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ: అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నవారు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు సైబర్ భద్రతా నిపుణులు. పాస్‌వర్డు లేకుండా వినియోగంలో ఉన్న వైఫై (వైర్లెస్ ఫిడెలిటీ) కనెక్షన్‌ను ఉగ్రవాదులు ఉపయోగించుకునే అవకాశముందని అంటున్నారు. ఇటీవల జరిగిన వారణాసిపేలుళ్లు తమ పనేనంటూ ఇండియన్ ముజాహిదీన్ మీడియాకు ఈ-మెయిళ్లుపంపించింది.
వీటికోసం ఉగ్రవాదులు ముంబయికి చెందిన డిస్క్ జాకీ అఖిల్ వైఫై కనెక్షన్‌ను ఉపయోగించుకున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు తాజాగా అఖిల్‌తో పాటు అతని సోదరుడు నిఖిల్‌ను చాలాసేపు విచారించారు. ఈ నేపథ్యంలో వైఫై కనెక్షన్ భద్రతపై నిర్లక్ష్యంగా ఉండొద్దని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. firewall సాఫ్ట్వేర్ సహాయంతో వైఫైకు రక్షణ కల్పించుకోవాలని పేర్కొన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి