విశాఖపట్నం, డిశంబరు 8: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా రెండవ పర్యాయం మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన పసుపులేటి బాలరాజుకు విశాఖపట్నం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గురువారం ఉదయం ఇండియన్ ఎయిర్లైన్స్ విమానంలో వచ్చిన ఆయనకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో
తరలి వచ్చిన కార్యకర్తలు మంత్రికి స్వాగతం పలికారు. శాసన సభ్యులు తైనాల విజయకుమార్, బోళెం ముత్యాలపాప, శాసన మండలి సభ్యులు డి.వి.సూర్యనారాయణ రాజు, డిప్యూటి మేయరు దొరబాబు, ఐఎన్టియుసి నాయకుడు మంత్రిరాజశేఖర్, పలువురు కార్పొరేటర్లు మంత్రి బాలరాజును కలసి అభినందించి స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి ప్రభుత్వ సర్క్యూట్ హౌస్కు బయలుదేరిన మంత్రి మార్గమద్యంలో ఎల్.ఐ.సి.భవనం వద్దగల డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం సర్క్యూట్ హౌస్కు చేరుకున్న మంత్రికి జిల్లా కలక్టరు జె.శ్యామలరావు, పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఇన్ఛార్జి ప్రాజెక్టు అధికారి,అదనపు జాయంట్ కలక్టరు అయిన ఎస్.సత్యనారాయణ, జిల్లా రెవెన్యూ అధికారి డి.వి.రెడ్డి, ముఖ్య ప్రణాళికాధికారి ప్రకాశరావు, ఆర్.డి.వో. కె.ప్రభాకరరావు తదితర అధికార్లు మర్యాద పూర్వకంగా కలిసారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి