Loading...

30, డిసెంబర్ 2010, గురువారం

పనుల వివరాలు సర్పంచ్‌కు చెప్పాలి

హైదరాబాద్‌, డిసెంబర్ ౨౯ (న్యూస్‌నెట్): గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామ పంచాయతీలే కీలకమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే స్పష్టం చేస్తున్నప్పటికీ... పథకం పర్యవేక్షణ అధికారుల ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి పనుల ఎంపిక, ఆమోదం కోసం ఈనెల 25వ తేదీ
వరకు పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. సర్పంచ్‌ల అధ్యక్షతనే ఈ కార్యక్రమం జరిగింది. ఆ గ్రామసభల్లో తీసుకున్న నిర్ణయాల వివరాలను తెలియజేయాలని సర్పంచ్‌లు కోరినా పలువురు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు (ఏంపీడీఓ), కార్యక్రమ నిర్వాహక అధికారులు నిరాకరిస్తున్నట్లు గ్రామీణాభివృద్ధిశాఖ దృష్టికి వచ్చింది. దీనిపై ఆ శాఖ తీవ్రంగానే స్పందించింది. గ్రామసభల్లో ఆమోదించిన పనులు, ఆ గ్రామంలో ప్రారంభించాల్సిన పనుల వివరాలను సంబంధిత సర్పంచ్‌లకు రాత పూర్వకంగా తెలియజేయాలని ఉపాధి హామీ పథకం సంచాలకుడు ఎ.మురళీ ఎంపీడీఓలకు స్పష్టం చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి