అనంతపురం: నిరాహార దీక్ష చేస్తోన్న తెదేపా అధినేత చంద్రబాబు ఆరోగ్యం కుదుటపడాలంటూ దేశం ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన శాసనసభ్యులు పరిటాల సునీత, పార్థసారధి, పల్లె రఘునాథరెడ్డి కసాపురం ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు.
రైతుల కోసం దీక్ష చేపట్టిన తమ నాయకుని ఆరోగ్యం క్షీణించకుండా చూడాలని స్వామిని వేడుకున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. చంద్రబాబు పేరున ఆంజనేయస్వామికి అర్చన చేయించారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి