Loading...

25, డిసెంబర్ 2010, శనివారం

రాష్ట్రపతి, ప్రధానిల క్రిస్మస్‌ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ప్రతిభా దేవి సింగ్‌ పాటిల్‌, ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌లు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మానవత్వానికి, శాంతి, సంతోషాలకు ఈ పండుగ ప్రతీక అని, ప్రజలు సమాజంలో ఐక్యత, సామరస్యం నెలకొల్పేందుకు కృషిచేయాలని రాష్ట్రపతి కోరారు.
ఉపరాష్ట్రపతి మహమ్మద్‌ హమీద్‌ అన్సారీ, లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ కూడా ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలను తెలిపారు. ఏసుక్రీస్తు శాంతి సందేశాలను ప్రతి ఒక్కరూ అనుసరిస్తూ సుఖ సంతోషాలతో వర్థిల్లాలని మీరాకుమార్‌ పేర్కొన్నారు. గవర్నర్‌, ముఖ్యమంత్రి..: క్రిస్మస్‌ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ ఈ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు, చిరంజీవి..: క్రిస్మస్‌ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, ప్రరాపా అధ్యక్షుడు చిరంజీవి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ''ప్రేమ, కరుణ, త్యాగం, దయాగుణాలకు ప్రతీక క్రిస్మస్‌. శాంతి, సహనం, సౌభ్రాతృత్వాల గొప్పతనాన్ని ఈ పండుగ గుర్తు చేస్తుంది'' అని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈవేడుకల్ని సమష్టిగా జరుపుకోవడం.. దేశ సమైక్యతను చాటిచెబుతుందని తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి