Loading...

27, డిసెంబర్ 2010, సోమవారం

చేనేత సమస్యలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్‌: చేనేత సమస్యలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నూలు కొనుగోలుపై 10 శాతం ఉన్న సబ్సిడీని 20 శాతానికి పెంచాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రద్దు చేసిన 50 శాతం విద్యుత్తు సబ్సిడీని పునరుద్ధరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
సిల్కు నూలు కొనుగోలుపై ప్రతి కుటుంబానికి రూ.800 లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 2007-08లో కేంద్రం రద్దు చేసిన 4 శాతం చేనేత పొదుపు నిధిని కూడా తామే భరించి 8 శాతం ఇస్తామని సీఎం తెలిపారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి