Loading...

29, డిసెంబర్ 2010, బుధవారం

ఉద్యాన, వాణిజ్యపంటల నష్టపరిహారం పెంచాలి: చిరంజీవి

గుంటూరు: లక్షలాది రూపాయలు వ్యయమయ్యే ఉద్యన, వాణిజ్యపంటలకు నష్టపరిహారాన్ని పెంచాలని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి డిమాండ్‌ చేశారు. వరిపంటతో సమానంగా దీనికి నష్టపరిహారం ఇస్తామనటం సమంజసం కాదన్నారు. అన్ని పంటలకు ఎకరాకు 2400 ఇవ్వటంపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.
కౌలురైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని కోరారు. రెండవపంటకు విత్తనాలను వందశాతం రాయితీపై అందించాలని కోరారు. విద్యార్థులపై కేసుల ఎత్తివేత అభినందనీయమని ఆయన అన్నారు. గుంటూరుజిల్లాలో రెండరోజు పర్యటన సందర్భంగా ఆయన తాను ఎప్పటికీ సమైక్యవాదినేనని అన్నారు. నరసరావుపేటనుంచి ఆయన రెండవరోజు యాత్ర ప్రారంభమైంది. గంగన్నపాలెం, చిలకలూరిపేట, యనమదల, ముట్లూరు, చేబ్రోలు, తెనాలి, వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, లింబుట్లవారిపాలెం మీదుగా ఆయన యాత్ర సాగుతుంది. బాపట్లతో ముగుస్తుంది.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి