అచ్యుతాపురం, డిసెంబరు 6 (చైతన్యవారధి): అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురుస్కరించుకొని హైదరాబాద్‌లో గచ్చీబౌలి స్టేడియంలో నిర్వహించిన వికలాంగుల క్రీడల పోటీల్లో మండలంలో ఆశ్రమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు విజేతలుగా నిలిచారు. షాట్‌పుట్‌లో గౌనపతి అరుణ, రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలోనూ, జావలిన్ త్రోలో బుదిరెడ్డి నాగమణి రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారు.
హైదరాబాద్‌లో హరిహర కళామందిరంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రప్రిన్సిపల్ కార్యదర్శి మీరా కుమారి, వికలాంగుల కమిషనర్ అనితా రాజేంద్రలు విజేతలకు ప్రశంసాపత్రంతో పాటు నగదు బహుమతులు అందించారు. విజేతలైన విద్యార్థినులను జిల్లా వికలాంగశాఖ సంచాలకులు వి.వి.ఎస్.ఎస్.ఎన్.మూర్తి, వికలాంగుల సంక్షేమ శాఖ అధ్యక్షులు పి.ఎస్.టి.పట్నాయక్‌లు అభినందించారు. జాతీయ అవార్డు గ్రహీత, డి.కైలాసపతిరావు, ఐ.వి.ఎ. పాఠశాల ఎ.ఎం. శ్రీరాజు, కన్వీనర్ సత్యసాయి కూడా విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి