బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ వినియోగదారులకూ సీయూజీ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇప్పటి వరకు పోస్టుపెయిడ్ వినియోగదారులకు మాత్రమే ఉన్న ఈ సదుపాయాన్ని ప్రీపెయిడ్ వారికి అందుబాటులోకి తీసుకువచ్చింది. 2జీ, 3జీ వినియోగదారులూ సీయూజీ గ్రూపులో చేరవచ్చని బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ ఒక ప్రకటనలో తెలిపింది.
మూడు నుంచి 25 నంబర్ల విభాగాలను చిన్న గ్రూపుగా, 26 అంతకన్నా ఎక్కువ నెంబర్ల విభాగాలను పెద్ద గ్రూపుగా విభజించారు. చిన్నగ్రూపుల్లోని వ్యక్తులు నెలకు రూ.80 చెల్లించి వారంతా ఉచితంగా మాట్లాడుకోవచ్చు. పెద్దగ్రూపులోని వ్యక్తులు నెలకు రూ.60 చెల్లించాలి. ఈ మొత్తాన్ని ప్రతినెలా వినియోగదారుడి బ్యాలెన్సు నుంచి తగ్గిస్తారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి