న్యూఢిల్లీ : 2జిస్పెక్ట్రమ్ కుంభకోణంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటుచేసేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నిరాకరించారు. పార్లమెంటు సభా సమయాన్ని అడ్డుకుంటున్న ప్రతిపక్షాల తీరును ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ అవినీతి అంశంపై భాజపా రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని ఆమె ఆరోపించారు. భూకుంభకోణంలో ఇరుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పదవికి రాజీనామా
చేయకపోవడాన్ని ఆమె ప్రస్తావించారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై సీబీఐ , పీఏసీ దర్యాప్తు చేస్తున్నందున జేపీసీ అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి