హైదరాబాద్: రైతు సమస్యలపై తెదేపా పోరు ప్రారంభమయ్యింది. అధినేత చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో చేపట్టిన ఈ దీక్షలో తొలిరోజు తెదేపా మహిళా ఎమ్మెల్యేలు, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ ఉదయం శాసనసభలోని గాంధీ విగ్రహం, ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్ నుంచి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు పాదయాత్రగా వచ్చారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి