Loading...

17, డిసెంబర్ 2010, శుక్రవారం

భక్తులతో కిటకిటలాడుతున్న వైష్ణవాలయాలు

హైదరాబాద్‌: వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులలు తిరుపతి చేరుకున్నారు. ఉత్తర ద్వారం నుంచి దేవదేవుని చూసేందుకు మూడు కి.మీ. మేర భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం క్యూలైన్లను నారాయణగిరి వరకు పొడిగించారు. శ్రీఘ్ర దర్శనానికి ఉదయం ఏడు గంటలకు మాత్రమే అనుమతిస్తామని తితిదే ఈవో కృష్ణారావు తెలిపారు. ముక్కోటి సందర్భంగా వీఐపీలకు ...ఉదయం 5.30గం.ల నుంచి 6.30గం.ల వరకే అనుమతించారు. మహాలఘు దర్శనం ద్వారా లక్షమంది శ్రీనివాసుని దర్శించుకోనున్నారు. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5గంటలు గరుడవాహనుడై శ్రీరామచంద్రుడు భక్తులకు దర్శనమిచ్చాడు. ఈ సందర్భంగా భద్రాద్రి రామునికి విశేష పూజలు నిర్వహించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి