3, డిసెంబర్ 2010, శుక్రవారం
అమెరికాలో వికీలీక్స్ అదృశ్యం
స్టాక్‌హోం: అమెరికాకు సంబంధించిన అనేక రహస్యపత్రాలను బహిర్గతం చేసి ఆ ప్రభుత్వ ఆగ్రహానికి గురిఅయిన వికీలీక్స్ వెబ్సైట్ అమెరికాలో అదృశ్యం అయింది. ఈ సంస్థకు అక్కడ సర్వీస్ ప్రొవైడర్‌గా ఉన్న ఎవ్రీ డీఎన్ఎస్ సంస్థ తాము ఇక వికీలీక్స్ డాట్ ఓఆర్జీ సైట్‌కు సేవలు అందించటం లేదని ఆ డొమైన్ నేమ్‌ను కిల్ చేస్తున్నామని ప్రకటించింది. ఆ వెబ్‌సైట్‌పై హాకర్ల దాడులు తీవ్రంగా ఉన్నాయని వారు తమకు సంబంధించిన ఇతర సర్వీస్ ప్రొవైడర్లపై కూడా దాడిచేసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఎవ్రీ డీఎన్ఎస్ సంస్థ అమెరికాలో 5 లక్షల వెబ్సైట్లకు సర్వీస్ ప్రొవైడర్‌గా ఉంది. తమ సైట్‌కు అమెరికాలో సేవలు నిలిపివేసిన విషయాన్ని వికీలీక్స్ నిర్వాహకులు ట్విట్టర్లో ధృవపరిచారు. వికీలీక్స్ డాక్యుమెంట్లను బహిర్గతం చేసేందుకు సేవలందించి సహకరించిన అమెజాన్ డాట్ కామ్ కూడా తన సేవలను బుధవారమే ఉపసంహరించింది. దీంతో వికీలీక్స్ స్విట్జర్లాండ్‌కు తరలింది. ఇకపై స్వీడిష్, ఫ్రాన్స్ కేంద్రంగా వికీలీక్స్ పనిచేస్తుందని నిర్వాహకులు తెలిపారు. వీకీలీక్స్ డాట్ ఓఆర్జీ బదులు ఇక వికీలీక్స్ డాట్ సీహెచ్ అనే డొమైన్ పేరుతో ఇది పనిచేస్తుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి