Loading...

20, డిసెంబర్ 2010, సోమవారం

రైతు కన్నీరు తుడిచేందుకు దేనికైనా సిద్ధం

- తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు
హైదరాబాద్‌: రైతు కన్నీరు తుడిచేందుకు తాను దేనికైనా సిద్ధమని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోమారు స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన రైతులకు బహిరంగ లేఖ రాశారు. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని కదిలించేందుకు మరో మార్గం లేకే నారాహార దీక్ష చేయాల్సివచ్చిందన్నారు. లాఠీఛార్జి, దౌర్జన్యాల ద్వారా ఉద్యమాన్ని అణిచి వేయాలని చూడడం అవివేకమని చెప్పారు. ఆస్పత్రి పాలు చేసినా, జైలుకు పంపినా, లాఠీ ఛార్జీలు చేసినా దీక్ష విరమించనని ఉద్ఘాటించారు. ఈ పోరాటం ఆరంభం మాత్రమేనన్నారు. తెదేపా ఎప్పుడూ రైతుల వెన్నంటే ఉంటుందని వివరించారు. పోరాటంలో తనతో పాల్గొన్న రైతు నాయకులు, మిత్రపక్షాలకు అభినందనలు తెలిపారు.

 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి