Loading...

26, డిసెంబర్ 2010, ఆదివారం

ప్రపంచంలో ఇంతకు ముందెన్నడూ జరగని విధంగా ఉద్యమం: కేసీఆర్‌

హైదరాబాద్‌: శ్రీకృష్ణకమిటీ నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్రానికి చేరుతున్న కేంద్ర బలగాలపై ఆలోచించాల్సిన అవసరం లేదని తెరాస అధినేత కె.చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణ విస్తృతస్థాయి స్టీరింగ్‌కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బలగాల పని బలగాలది, తమ పని తమదేనని అన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో కొత్త విషయాలేవీ ఉండవని తెలంగాణ ఇస్తే అనుకూల, ప్రతికూలతలు; సమైక్యాంధ్ర ఇస్తే వచ్చే అనుకూల ప్రతికూలతలు మాత్రమే నివేదకలో ఉంటాయని తనతో దుగ్గల్‌ చెప్పినట్లు కేసీఆర్‌ తెలిపారు. ఐకాస అనుమతి లేకుండా ఎవరూ బంద్‌కు పిలుపున్విద్దని కోరారు. అన్ని ఉద్యమాలను సమన్వయం చేసి ఐకాస ద్వారానే పిలుపునివ్వాల్సిందిగా తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణపై తానూ, కోదండరాం కలసి రెండ్రోజుల్లో ఓయూ విద్యార్థి నేతలతో మాట్లాడతానన్నారు. నాయకులను ప్రశ్నించేలా ప్రజలను సన్నద్ధం చేయాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. తాము చేయబోయే ఉద్యమం ప్రపంచంలో ఇంతకు ముందెన్నడూ జరగని విధంగా ఉంటుందన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి